కోత రకాలు :

1)  బంగినపల్లి (బనేశాన్)

 చెట్టు మద్యస్థం, పండు పెద్దది. తోలు పలుచన, పసుపురంగు కండ గట్టిగా ఉండి నార తక్కువగా ఉంటుంది. నాణ్యమైన రకం.

నిలకడగా ప్రతి ఏటా కొద్దిగా ఆలస్యంగా కాపు కాచే రకం.

బూడిదతెగులు, తేనే మంచు పురుగు మరియు గాలులను ఓ మాదిరిగా తట్టుకునేరకం.

రెండు తెలుగు రాష్ట్రలకు అనుకూలం.

ముఖ్యమైన వాణిజ్య రకం. ఎగుమతికి అనుకూలం.

తెలంగాణలో కన్నా ఆంద్ర లో  15 రోజుల ముందుగా కాయ పక్వానికి వస్తుంది. ఎక్కువ కాలం నిలవకు అనుకూలం.